పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తెలంగాణ

  • పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరెకపూ డి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ పారిశ్రామిక రంగం అగ్రపథంలో దూసుకెళ్తుందని ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జోనల్ మేనేజర్ TSIIC సైబరాబాద్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని Tech Mahindra Learning world మీటింగ్ హాల్ లో పారిశ్రామిక ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, డీసీ శ్రీ వెంకన్న, డీసీ సుధాంష్ తో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమధనం, దార్శనికత మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదల వలనే నేడు హైదరాబాద్ నగరం విశ్వనగరంగా దిన దిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఐటి హబ్ గా శేరిలింగంపల్లి విరజిల్లుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెరిగాయని అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సరళతరం వంటి విషయాలలో ప్రభుత్వం తనవంతు ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా అయ్యేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.

ఐటి పరిశ్రమలకు అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని ,ప్రయాణం కు అనుకులంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించడం జరిగినదని, మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

2014 – TS-IPASS

• 22 వేల పరిశ్రమలు వచ్చాయి.

• 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి

• 18 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి.

 ప్రభుత్వ ఐటీ పార్కులు

 సైబరాబాద్ జోన్లోనే 2,250 ఎకరాలు.

 10 లక్షల మందికి ఉపాధి.

 సిలికాన్ వ్యాలీకి ధీటుగా, టీ-హబ్, వీ-హబ్.

 టీ-ఐడియా, టీ-ప్రైడ్ – అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు

రాష్ట్ర ఎగుమతులు

 2014- 1 లక్ష కోట్లు

 2022-2.75 లక్షల కోట్లు

శేరిలింగంపల్లి నియోజకవర్గం

 మెజారిటీ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నవి శేరిలింగంపల్లిలోనే.

 2014 నుండి శేరిలింగంపల్లి లో పెట్టిన పెట్టుబడులు అక్షరాలా 15 వేల కోట్లు. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి.

 దేశంలోని అన్ని రాష్ట్రాలవాళ్ళు ఇక్కడ స్థిరపడుతున్నారు.

 పెరుగుతున్న జనాభాతో పెరుగుతున్న అవసరాలు.

 రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లై-ఓవర్లు, కరెంటు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఆరొగ్యం, ఇలా అన్నిటి సామర్థ్యం పెంచాలి.

 8500 కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి చేసామని గర్వంగా చెప్పగలను.

 2800 కోట్లతో అండర్ పాస్, బ్రిడ్జీలు, ఫ్లై-ఓవర్లు, డ్రైన్ల నిర్మాణాం చేసాం.

• లింకు రోడ్ల ఏర్పాటుకు సుమారు 500 కోట్లు

• మంచినీటి పైప్ లైన్లకు సుమారు 200 కోట్లు

• కొత్త సీవరేజ్ లైన్లకు సుమారు 150 కోట్లు

• షేక్ పేట్ నుండి మాధాపూర్ వరకు మంచినీటి వసతికి 50 కోట్లు

• మిషన్ భగీరథ ద్వారా 700 కోట్లతో 800 కిలోమీటర్ల పైప్లైన్, 18 రిజర్వాయర్లు నిర్మాణం.

• సుమారు 500 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు

• 50 కోట్లతో 40 చెరువుల సుందరీకరణ

• 500 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం

• 700 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు,  విద్యుతీకరణ. కొత్తగా అందుబాటులో 5 సబ్-స్టేషన్లు.

 నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 20 కోట్లతో సీసీ కెమేరాలు, కమ్యూనిటీ హాల్స్, పార్కులు, మహిళా భవన్ల నిర్మాణం.

 “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” లో తెలంగాణ అగ్రస్టానం

 రైతు బందు పతకం కింద ఎకరానికి 10 పది వేల రూపాయలు చొప్పున పంట సహాయం అందించి నిజమైన రైతు బాంధవుడు మన ముఖ్య మంత్ర్రి కేసీఆర్ అన్నారు.

ి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులకు పూర్వ వైభవం ,

 మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నామని , 20,000 లీటర్ల ఉచిత మంచినీరు పథకం ద్వారా మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు

 వృద్ధులకు ,వికలాంగులకు ,ఒంటరి మహిళలకు ,చేనేత ,గీత కార్మికులకు ,HIV బాధితులకు ఆసరా పింఛన్లు ,

 కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లకు ఆపన్న హస్తం ,

 CMRF ద్వారా పేద ప్రజలకు వైద్య సహాయం

 కెసిఆర్ కిట్ , కంటి వెలుగు

 అమ్మఒడి ,

 హాస్టల్ విద్యార్థులకు సన్న రకం బియ్యం ,

 గురుకుల పాఠశాలల ద్వారా అల్పసంఖ్యల వర్గాలకు ఉచిత విద్య.

 మైనారిటీ రెసిడెంటిల్ స్కూల్.

 ఓవర్సీస్ స్కాలర్ షిప్

 అల్పసంఖ్యల వర్గాలకు ఉపకార వేతనాలు. వంటి అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ కు బాటలు వేస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో TSIIC జోనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్, CVN వర్మ ఏషియా గ్లోబల్ హెడ్ మైండ్ స్పేస్, శ్రవణ్ కుమార్ మైండ్ స్పేస్ హెడ్, జిప్సన్ పౌల్ , కృష్ణ ఎదుల, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, గణపతి, గోపాల్ యాదవ్, రాథోడ్ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here