- కొనసాగుతున్న గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్ర
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ నాయకులు వసూళ్లు, కబ్జాలపై ఉన్న దృష్టిని ప్రజా సమస్యలపై పెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ హితవు పలికారు. గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ లోని పి.జే.ఆర్ నగర్ , గుల్షన్ కాలనీ ,పాన్ మక్త లలో ప్రతి ఇంటికి బిజెపిని చేరువ చేస్తూ గచ్చిబౌలి బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సరైన రోడ్లు లేవని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, సంవత్సరాల నుండి పెన్షన్లు మంజూరు కాలేదని , ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని స్థానిక నాయకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలో ప్రజలు తెలియజేసే ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని, ప్రతి సమస్యను ప్రణాళికా బద్దంగా అన్ని డివిజన్లలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామనీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మన్యం కొండా సాగర్, చెన్నయ్య, చంద్ర శేఖర్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, రవి నాయక్, భరత్, గోపాల కృష్ణ రాజు, మఖన్ సింగ్, సాగర్, బంటి, మేరీ, లక్ష్మణ్ , గణేష్, మల్లేష్, శ్రీను, మురళి, సామ్రాట్, రామకృష్ణ, అనిల్ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.