నమస్తే శేరిలింగంపల్లి: మే డే’ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ . 1 వెయ్యి చొప్పున పెంపును హర్షిస్తూ.. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , మాధవరం రోజాదేవి రంగరావు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు పుష్పగుచం అందశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానమని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు అమోఘమని, పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తారని వారి సేవలను కొనియాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచారని, వారి ఆరోగ్యం కూడా తమ బాధ్యతని తెలిపారు. మన ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, చంద్రమోహన్ సాగర్, KN రాములు, ఖాసీం పాల్గొన్నారు.