నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నివారణ కోసం సిఐ తిరుపతిరావు పర్యవేక్షణ లో వాహనాల తనిఖీ నిర్వహించారు. జెపి నగర్, ప్రశాంత్ నగర్, కృషినగర్ మెయిన్ రోడ్ లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా.. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారి వివరాలు తెలుసుకుని విడిచిపెట్టారు మియాపూర్ పోలీసులు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, దృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పని సరిగా ఉండాలని, వాటిని వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అంతేకాక ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులతో పాటు జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.