- అవంతిక గ్రూప్ ఆధ్వర్యంలో 10కే, 5కే, 2కే రన్
- జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అవంతిక గ్రూప్ ఆధ్వర్యంలో 10కే, 5కే, 2కే రన్ నిర్వహించారు. ఈ రన్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. 10కే, 5కే, 2కే రన్ నిర్వహించిన అవంతిక గ్రూప్ ను అభినందించారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, క్రీడలు ఇందుకు దోహదపడతాయని తెలిపారు. అంతకుముందు కాలనీ పిల్లలు, యువత, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంతో ఉదయమే గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఉదయం నుండే ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో అవంతిక గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , శిరీష పాల్గొన్నారు.