నమస్తే శేరిలింగంపల్లి : చెరువుల సుందరీకరణ, వాటి పరిరక్షణే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో నాయనమ్మ కుంట చెరువు అభివృద్ధిలో భాగంగా రూ. 1 కోటి 25 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నగర్ లో నాయనమ్మ కుంట అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం చేసేలా పునరుద్ధరణ, చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం , చెరువు అలుగు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నాయనమ్మ కుంట చెరువును సుందరవనంగా, శోభితవర్ణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు సాంబయ్య రమణ, శ్రీధర్ , మల్లికార్జున్ రావు, ఈశ్వర్ నాయుడు, కాలనీవాసులు పాల్గొన్నారు.