- నాలుగు రాయల్ ఎన్ ఫీల్డ్ ద్విచక్రవాహనాలు స్వాధీనం
నమస్తే శేరిలింగంపల్లి : జల్సాలకు అలవాటుపడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దురు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఖాజీ గల్లిలో నివసించే సయ్యద్ సాహిల్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. యూసుఫ్ గూడ హెచ్ ఎఫ్ నగర్ లో ఉండే సయ్యద్ తాబ్రెస్ హోమ్ థియేటర్ పనులు చేపడుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు కాగా.. జల్సాలకు అలవాటు పడి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే బుధవారం రాయదుర్గంలో పరిధిలో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకోవడంతో వారి నుంచి నాలుగు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను స్వాధీనం చేస్తుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు, కేసు దర్యాప్తు మొదలు పెట్టారు.