నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు

  • ఆమెజాన్ సబ్ స్క్రిప్షన్ పేరిట ఆస్ట్రేలియా వాసులకు టోకరా
  • రంగంలోకి దిగి 13 మందిని అరెస్ట్ చేసిన ఎస్ వోటీ బృందం
మేడ్చల్ డీసీపీ సందీప్ , ఎస్ వోటీ పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి : అమేజాన్ ప్రైమ్ సబ్ స్ర్కిప్షన్ పేరిట ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తులను మోసగిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు పేట్ బషీర్ బాద్ ఎస్వోటీ పోలీసులు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. రామకృష్ణా రెడ్డి, ఆకాష్, వెస్లీ పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 13 నంబర్ డెస్క్‌టాప్ మానిటర్లు, 14 సీపీయూలు , 13 హెడ్ సెట్‌లు; ఒక హార్డ్ డిస్క్, 8 కొత్త సిమ్ కార్డులు, 18 మొబైల్ ఫోన్లు, ఒక ఫార్చ్యూనర్ కారు TN-11/J-323, రూ. 5వేల 940 నగదు, ఇంటర్నెట్ రూటర్లు, టెలికమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎస్ వోటీ డీసీపీ ఎంఏ రషీద్, అదనపు డీసీపీ శోభన్ కుమార్, ఇన్ స్పెక్టర్లతో కలిసి మేడ్చల్ డీసీపీ సందీప్ ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఆ వివరాలను పేట్ బషీర్ బాద్ లో వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రబేష్ కుమార్ ప్రసాద్ (39), సర్బేష్ కుమార్ గుప్తా (32), బైరిక్ ప్రమోద్ రెడ్డి , కుంచాల అజయ్ కుమార్ (37) రామకృష్ణా రెడ్డిలు సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇందులో టెలికాలర్లుగా ముఖేష్ రజాక్ (34) కర్మ షెపాల్ (33) Md ముస్తఫా (22) అనమోల్ ప్రదాన్ (26), రాయ్ రిష్కాంత్ (33), మహ్మద్ సమీర్ (20), గుంజి పవన్ కళ్యాణ్ (20), సాయి వర ప్రసాద్ (21) నాయకోటి బస్వరాజు (37) నియమించుకున్నట్లు తెలిపారు. అయితే కాల్ సెంటర్ నిర్వాహకుల తీరుపై అనుమానం రావడంతో ఓ వ్యక్తి 100 డయల్ చేయడంతో.. ఎస్ వో టీ బృందం రంగంలోకి నకిలీ కాల్ సెంటర్ గుట్టు విప్పి 13 మందిని అరెస్ట్ చేశారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here