- బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఎల్లమ్మబండ చౌరస్తా దగ్గర అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బండి సంజయ్ అక్రమ అరెస్టు ప్రజాస్వామికమైనటువంటి విధానమని అన్నారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బండి సంజయ్ ని చూస్తేనే భయపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతల వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తున్నందుకే బిజెపిపై కేసీఆర్ కుట్రపన్ని బిజెపి, బీజేవైఎం నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. వెంటనే బండి సంజయ్ కి బహిరంగ క్షమాపణ చెప్పి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్ , నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, మణిభూషణ్ , రవీందర్రావు, కమలాకర్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, నర్సింగ్ రావు, అనిల్ కుమార్ యాదవ్, గోపాల్ రావు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రఘు, ఎత్తరి రమేష్, సందీప్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్, అశోక్, రవి ముదిరాజ్, రాయల్, నరేష్, అనిత, పార్వతి పాల్గొన్నారు.