మూడో రోజుకు చేిరన రవన్న ప్రజా యాత్ర
నమస్తే శేరిలింగంపల్లి : రవన్న ప్రజా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది. జలకన్య హోటల్ దగ్గర మొదలుకొని సాయి నగర్ వెస్ట్, సాయి నగర్ ఈస్ట్ ఆదిత్య నగర్, ఆల్విన్ కాలనీ సెకండ్ ఫేస్ వరకు కొనసాగింది. స్థానిక నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజిత్ వర్మ , గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రవీందర్ రావు, కో కన్వీనర్ మణి భూషణ్, డివిజన్ జీఎస్ లు రఘు, రాజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ఇక్కడ సమస్యలు కంటికి కనబడడం లేదా అని ప్రశ్నించారు.
మంజీరా పైపు లైన్ తవ్వి రోజులు గడుస్తున్న మరమ్మత్తులు చేయకపోవడంతో నిత్యం జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు ,నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఎక్కడ చూసినా సమస్యలే, పింఛన్లు, రేషన్ కార్డ్స్, డబల్ బెడ్ రూమ్స్ చెప్పుకుంటూ పోతే డివిజన్లో ఎన్నో చెప్పుకోలేనన్ని సమస్యలు కనిపిస్తున్నాయని, చాలా బాధగా ఉందన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇస్తూ పాదయాత్రను ముందుకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, వినోద రావు, నరసింహ చారి, వెంకటస్వామి రెడ్డి , రాయల్ , శ్రీను రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్ , అనిల్ కుమార్ యాదవ్ , ఎత్తరి రమేష్, శివాజీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.