శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగరాలి : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రెండో రోజూకు చేరిన రవన్న ప్రజా యాత్ర

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రవన్న ప్రజా యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఆల్విన్ కాలనీ డివిజన్ జలకన్య హోటల్ దగ్గర మొదలుకొని తులసి నగర్, శ్రీ తులసి నగర్, వాంబే హౌసెస్, భూదేవి హిల్స్ మొదలగు ప్రాంతాలలో కొనసాగింది.

ఆల్విన్ కాలనీ డివిజన్ లో రెండో రోజూ రవన్న ప్రజా యాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, కో -కన్వీనర్ మణిభూషణ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, విజిత్ వర్మ, డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు, అధికార ప్రతినిధి వేణు గోపాల్ యాదవ్ పాల్గొని గడపగడపకు తిరుగుతూ.. నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు తెలియజేశారు. ఈ పాదయాత్రలో బిజెపి పార్టీ శ్రేణులు ప్రజల దగ్గర నుండి అనేక సమస్యలను గుర్తించారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం, వృద్ధాప్య పింఛన్ ఇవ్వకపోవడం, నిరుద్యోగులకు మొండిచేయి, నిరాశ మిగిల్చిన రెండు పడకల ఇండ్ల హామీ.. ఇలా ఎన్నో వారి దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మౌలిక వసతులను కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కమిషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలతో, బెదిరింపులతో ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు పరిపాలన చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెంట్ కార్పొరేటర్, మహిళా మోర్చా, యువ మోర్చా, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here