- మదీనగూడలో నాలా విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుంచి దీప్తి శ్రీ నగర్ నాలా (వయా జాతీయ రహదారి NH 65 వరకు) రూ.15 కోట్ల 88 లక్షల అంచనా వ్యయంతో 2.4 కిలోమేటర్ల మేర నాల విస్తరణ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా మదినగూడలో జరుగుతున్న నాలా విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించి మాట్లాడారు.
వర్షాకాలం దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాల విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమామహేశ్వరావు, నాగేశ్వరరావు, మోహన్, సురేందర్, ప్రదీప్, పనింద్ర, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.