నమస్తే శేరిలింగంపల్లి : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ సాయి, మణి, నాగరాజు , థామస్, అజయ్ , అల్లూరి అజయ్ ఆధ్వర్యంలో మాదాపూర్ గోకుల్ ప్లాట్స్ నుండి భారీగా యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
వర్షం పడిన, కొంత మంది అడ్డుకోవాలని చూసిన , కరెంట్ తీసేసి ఆటంకాలు కలిగించిన అన్నిటినీ తట్టుకుని నిలబడి భారతీయ జనతా పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుందని, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని , కానీ తెలంగాణలో కేసిఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుని అభివృద్ధి మాట పక్కన పెడితే , స్కాములకు, అవినీతి కి ,అక్రమాలకు అడ్డాగా మారిందని ఎద్దేవా చేశారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆయన బాటలోనే అభివృధి మరచి , భు కబ్జాలకు , అవినితి కి అడ్డాగా మార్చరన్నారు. గోకుల్ ప్లాట్స్ లో గాని, నియోజకవర్గంలో గానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీకు నేనున్నాను అని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, మదనా చారి, సందీప్ గౌడ్, హరికృష్ణ , శ్రీధర్ ,బీజేపీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.