ఏఈ పేపర్ లీక్ పై న్యాయ విచారణ జరపాలి

నమస్తే శేరిలింగంపల్లి: టీ ఎస్ పీ ఎస్సీలో ఏఈ పేపర్ లీక్ పై న్యాయ విచారణ జరిపి లీక్ కారకులైన అధికారులను బర్తరఫ్ చేయాలి. పునరావృత్తం కాకుండా చూడాలి. టీఎస్ పీఎస్ సిలో 5న జరిగిన రెండు పరీక్ష పేపర్లు ముందే లీక్ కావడం ప్రభుత్వానికి సిగ్గు చేటు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (Ae civil) పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు పోలీసులు తెలిపారని, ప్రవీణ్ కుమార్ పై చట్టరిత్త్యా చర్యలు తీసుకు న్నారు. కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను.

_ పల్లె మురళి
AIFDS రాష్ట్రఅధ్యక్షులు

పేపర్ లీక్ కావడం వల్ల వేలాదిమంది నిరుద్యోగులకు నష్టం జరిగిందని ఇది పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అధికారులపై ఉంది. పరీక్ష పత్రం లీక్ కావడం వల్ల Tspsc ప్రతిష్ట దెబ్బ తిన్న దని ఎన్నో ఆశలతో కటోర దీక్షతో సన్నద్ధమైన అభ్యర్థులకు న్యాయం జరగాలి. అధికారుల నిర్లక్ష్యం వలన గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో కొంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే దీనిపై పూర్తి విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here