- 18 వరకు వైద్య సలహా .. హాస్పిటల్ చార్జీల మినహాయింపు
- జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకొని గాలెన్ హాస్పిటల్ నిర్ణయం
- సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
- ప్రత్యేక టీకా శిబిరం ఏర్పాటు
నమస్తే శేరిలింగంపల్లి: మన ఆరోగ్య సంరక్షణకు టీకాలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వైరస్ ల ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా.. ప్రాణాంతకమైన మహమ్మారిల బారి నుండి రక్షించేందుకు టీకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 16న కేంద్ర ప్రభుత్వం జాతీయ టీకా దినం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన శిశువు నుంచి పెద్దల వరకు తీసుకోవాల్సిన పలు రకములైన టీకాలపై ప్రత్యేక అవగాహన కలిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రభుత్వంతో పాటూ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ దిశగా పని చేస్తాయి. ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ గాలెన్ హాస్పిటల్ ముందడుగు వేసింది. మియాపూర్ లోని కల్వరీ టెంపుల్ రోడ్డులో ఉన్న కుటుంభ ఆరోగ్య కేంద్రమైన గాలెన్ హాస్పిటల్ ప్రత్యేక టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 15 నుంచి టీకాలు వేయించుకోదలచిన వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. గాలెన్ హాస్పిటల్స్ డా. రామకృష్ణ, సీనియర్ కన్సల్టెంట్, జనరల్ సర్జన్ నేతృత్వంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. భాస్కర్, డా. శ్రీనివాస్ సుబుద్ది ల పర్యవేక్షణలో ఈ శిబిరం కొనసాగుతున్నది.
టీకా శిబిరానికి సంబంధించిన వివరాల గురించి డా. శ్యాం సుందర్, కన్సల్టెంట్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు, ఛైర్మన్, గాలెన్ హాస్పిటల్ మాట్లాడుతూ టీకా వేయించుకోదలచిన వారు ముందస్తుగా తమ పేరును నమోదు చేయించుకొంటే వారికి టీకాను అందించడానికి అవసరమైన డాక్టర్ కన్సల్టేషన్ , టీకా వేయడానికి విధించే హాస్పిటల్ చార్జీలను మినహాయించి కేవలం టీకా ధరను మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. చిన్నారి శిశువులకు, పిల్లలకు టీకాలు వేయించుకోవాలనే తల్లితండ్రులకు అవసరమైన సలహా సూచనలు చిన్న పిల్లల వైద్య నిపుణులు ద్వారా అందించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. సాధారణంగా చిన్నారులకు వైద్యులు నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం టీకాలు వేయించదలచిన తల్లితండ్రులు హాస్పిటల్ వద్ద పేరు నమోదు చేసుకొంటారో వారికి వైద్యులు నిర్థారించిన టీకా షెడ్యులు ప్రకారం టీకా విధించేటపుడు హాస్పిటల్ చార్జీలను పూర్తిగా మినహాయించడమే కాకుండా టీకా అసలు ధర మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా 10 ఏళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా లాభం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి చిన్న పిల్లల వైద్య నిపుణుల కన్సల్టేషన్ ను 18వ తేదీ వరకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
సమాచారం కోసం 091339 11446.నెంబర్ ను సంప్రదించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.