నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, KP వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, కాలే యాదయ్య, ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్ రెడ్డి, శంబిపూర్ రాజు , మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పల పాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు పాల్గొన్నారు.