నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ సిద్దిఖ్ నగర్ బస్తీ అసోసియేషన్ ఎన్నికల్లో కాలే బసవరాజు 2వ సారి అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా గణేష్ , కోశాధికారిగా రాము ఎన్నుకోబడిన సందర్బంగా, సిద్దిఖ్ నగర్ నూతన అధ్యక్షుడు, అసోసియేషన్ కమిటీ సభ్యులు కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ ని మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్బంగా షేక్ ఆదిల్ పటేల్ నూతన అధ్యక్షులు, అసోసియేషన్ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
బస్తీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మీ అందరి సహకారంతో చేసుకుంటూ వస్తున్నామని, ఎప్పటికి ఇలానే మీ సహకారం ఉండాలని నూతన అసోసియేషన్ సభ్యులను కోరారు. బస్తీలో ఎటువంటి సమస్యలు ఉన్న కలసి కట్టుగా ఉండి సత్వరమే పరిష్కరించుకుందామని ఆదిల్ పటేల్ సిద్దిఖ్ నగర్ బస్తీ నూతన అసోసియేషన్ సభ్యులతో అన్నారు. కార్యక్రమంలో బుడుగు తిరుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, గోపాల్ గౌడ్, రాజు పాల్గొన్నారు.