నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో చైర్మన్ మంగళరపు లక్ష్మణ్ చిన్నారుల మెగా సైన్స్ ఎక్సపో ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ విచ్చేసి తిలకించారు.
ఈ సందర్బంగా చైర్మన్ మంగళరపు లక్ష్మణ్ కు, ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి కి శుభాభినందనలు తెలిపారు. పిల్లల్లో ఉన్న మేధా శక్తీని వెలికి తీసే ఇలాంటి బహూత్తర కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ సందర్బంగా చిన్నారులు వేసిన సీతారామ కళ్యాణం నాటికను చూసి, పాత్రదారులైన చిన్నారులను అభినందించారు. స్కూల్ చిన్నారులు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ & సామాజిక నమూలను చూసి ముచ్చటపడి, చిన్నారుల మేధా శక్తిని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారులలో ఆసక్తి పెరిగి, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తే, వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా దోహదం చేస్తాయని అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు కె. నిర్మల, బుడుగు తిరుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ కాలే బసవరాజు తదితరులు పాల్గొన్నారు.