నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సింగారయ్య అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా .. సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి నుంచి రూ. 2 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి పత్రాన్ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.