నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి నగర్ లో మంజీరా నీటి సమస్య వేధిస్తున్నది. నీరు సరఫరా అవుతున్నా.. తక్కువ ప్రెజర్ వస్తుండటంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామని కాలనీ ఎత్తులో ఉండడం వల్ల ప్రెజర్ తక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ప్రభుత్వ విప్ గాంధీ జలమండలి అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్, చాగంటి అశోక్, సైదులు, కృష్ణ, చంద్రశేఖర్, కోటిరెడ్డి, వెంకటేష్, వెంకటయ్య పాల్గొన్నారు.