నమస్తే శేరిలింగంపల్లి : ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ లోని శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ రంగారెడ్డి ( అర్బన్) జిల్లా బీజేపీ కార్యదర్శి,చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో విద్యా నగర్ కాలనీ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కన్వీనర్ రాఘవేందర్ రావు, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,చందర్ రావు, జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి గౌస్, డివిజన్ మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు రామణకుమారి, ప్రధాన కార్యదర్శి రాధిక, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీను, నర్సింహ రావు పంతులు, లింగం బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.