- రోగి ప్రాణాలు కాపాడిన బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్స్
నమస్తే శేరిలింగంపల్లి : బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన అజయ్ కుమార్ (32) ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. తను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి, పని నిమిత్తం వేరే ఆఫీస్ కి వెళ్ళాడు.. అయితే అక్కడ అకస్మాత్తుగా అపస్మారకస్థితిలోకి వెళ్లడం.. పేరలసిస్ కు గురవ్వడం వెనువెంటనే జరిగాయి. వెంటనే తన సహోద్యోగులు బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు. ఎం ఆర్ ఐ స్కాన్ తీయగా మెదడులో చిన్న రక్తపు గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్ సర్జరీ అవసరంలేకుండానే మినిమల్లి ఇన్వేసివ్ పద్దతిలో స్టెంట్ (కాథెటర్ సక్షన్, స్టెంట్ రిట్రీవర్‌లను ఉపయోగించి మెకానికల్ థ్రోంబెక్టమీ) చేసి రోగిని కాపాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రణధీర్ కుమార్ మాట్లాడుతూ ” తీవ్రమైన స్ట్రోక్ అనేది సెరెబ్రోవాస్కులర్ ఎమర్జెన్సీ” దీని కారణంగా మెదడుకు రక్త సరఫరాలో ఆకస్మిక అంతరాయం కలుగుతుంది. స్ట్రోక్ లక్షణాలు ముఖం, చేయి, కాలు, మాట్లాడటంలో అకస్మాత్తుగా బలహీనత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల స్ట్రోక్‌కు గురవుతున్నారని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ “అక్యూట్ బ్రెయిన్ ఎమర్జెన్సీని ప్రోటోకాల్ ఆధారిత చికిత్స ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చని, మెడికవర్ హాస్పిటల్స్ లో అన్ని రకాల స్ట్రోక్ ఆధారిత ప్రొటొకాల్స్ ని పాటిస్తూ అత్యవసర పరిస్థితులలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. బేగంపేట్ మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ హృషీకేశ్ మాట్లాడుతూ.. బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్స్ లో అత్యుత్తమ వైద్య నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, ఎమర్జెన్సీ ఏ సమయంలో వచ్చినా నిష్ణాతులైన వైద్యబృందం వెంటనే సత్వరమైన చికిత్స అందిస్తుందని చెప్పారు. అత్యంత ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తికి అత్యాధునిక వైద్యం అందించి బ్రెయిన్ స్టెంట్ వేసి కాపాడడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్, మెడికల్ డైరెక్టర్ సతీష్ కైలాసం, న్యూరోఫిజిషియన్ డాక్టర్ గౌసుద్దీన్, సెంటర్ హెడ్ హృషీకేశ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భార్గవ్ పాల్గొన్నారు.