జీతాలు ఇచ్చాకే… విధులు నిర్వహిస్తాం

  • గచ్చిబౌలి స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది ధర్నా
  • 3 నెలల జీతాలు చెల్లించడం లేదని ఆవేదన
నో శాలరీ.. నో డ్యూటీ అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు

నమస్తే శేరిలింగంపల్లి: మూడూ నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ. . సెక్యూరిటీ ఏజెన్సీ స్నిపర్ సంస్థకు వ్యతిరేకంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు ధర్నాకు దిగారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో చాలాకాలంగా సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్లుగా, హౌస్ కీపింగ్ విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, అడిగితే పొంతన లేని పనులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకుంటే తాము కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. తమకు రావాల్సిన మూడు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని, అప్పటి వరకు విధులు నిర్వహించమని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు జీతాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు.

గచ్చిబౌలి స్టేడియం ఎదుట సెక్యూరిటీ సిబ్బంది నిరసన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here