- దగ్గరుండి పనులు పూర్తి చేయించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఎల్లమ్మ బండ ప్రధాన రహదారిలో గాంధీ విగ్రహం సమీపంలో కాలనీలో రోడ్లపై వరద నీరు నిలిచిందన్న కాలనీవాసుల వినతి మేరకు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి వరద నీరు సాఫీగా వెళ్లేలా పైపులైను పనులను పూర్తి చేయించారు. పైప్ లైన్ పనులు నిర్వహిస్తున్న సమయంలో వర్షం కారణంగా కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ వర్షంలో అక్కడే ఉండి మోటార్ల సాయంతో నీటిని తొలగించి కచ్చితంగా పని పూర్తి చేయాలని పట్టు బట్టి కూర్చుని పనులను పూర్తి చేయించారు. పైప్ లైన్ పనులు పూర్తి చేయించినందుకు గాను కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్, వార్డు మెంబర్ చిన్నొళ్ళ శ్రీను, నాయకులు పి. వెంకటేష్, రాములు గౌడ్, బోయ కిషన్, మున్నాభాయ్, మౌలానా, వాసు, నాగభూషణం, యాదగిరి, రామచందర్, గుడ్ల శీను తదితరులు పాల్గొన్నారు.