- జనప్రియ నగర్ ఫేస్ 2 కమ్యూనిటీ హాల్ లో కంటి వెలుగు శిబిరం ప్రారంభం
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 2 కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అత్యున్నత కంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందని, కంటి సమస్యలున్న వారు తమతమ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షా శిబిరానికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని, మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ఉచిత కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి కళ్ళద్దాలు, కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బలింగ్ గౌతమ్ గౌడ్, అధ్యక్షుడు వాలా హరీష్ రావు, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, శేఖర్ గౌడ్, బాబుమోహన్, మల్లేష్, జనార్ధన్, ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్ , రాజేందర్, రాము, ఉమామహేశ్వరరావు, అశోక్ కాలనీ వాసులు పాల్గొన్నారు.