మీదికుంట చెరువు కబ్జా కాకుండా చూస్తాం

  • మీదికుంట చెరువును పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏఈ పావని

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధి మియాపూర్ లోని మీదికుంట చెరువును సోమవారం ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏ ఈ పావనిలు పరిశీలించారు. సర్వే నెంబర్ 44/5, 139ల మధ్యనున్న ప్రభుత్వ భూమిని సర్వే చేసి, హద్దు బంధులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. త్వరలోనే కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కుంటను కబ్జా కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్ ఐ శీనయ్యకు ఫోన్ లో పలు సూచనలు చేశారు. జాయింట్ సర్వే చేసి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

మీదికుంట చెరువును పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏఈ పావనిలతో సంతోష్ రెడ్డి, కృష్ణ పటేల్

ఈ సందర్భంగా బిఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు టి.సంతోష్ రెడ్డి, బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.కృష్ణ పటేల్, బి.కె. ఎన్ క్లేవ్ మాజీ అధ్యక్షుడు కె.పాపిరెడ్డిలు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని కాపాడాలని, కట్ట పై నుండి యధావిధిగా దారిని పునరుద్ధరించాలని గతంలోనే కలెక్టర్ కు, ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వోకు జిహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్, చందానగర్ సర్కిల్ 21జి హెచ్ ఎం సి కమిషనర్ కు, ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ పట్టిచుకోలేదన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కలిసి విన్నవించగా.. ఆయన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్ కు లెటర్ రాసి, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి కబ్జా కాకుండా చూడాలని కోరారని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాక చెరువు కబ్జా కాకుండా సర్వే చేసి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here