డీకే అరుణను కలిసిన రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్

– మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి అంటూ వినతి

మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): బిజెపి రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ఆదివారం సాయంత్రం అరుణను కలిసిన నాగేశ్వర్ గౌడ్ మియాపూర్ డివిజన్ నుండి పార్టీ తరపున కార్పోరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ బయోడేటాను అందజేశారు. కాగా తన అభ్యర్థిత్వం పట్ల అరుణ సానుకూలంగా స్పందించారని నాగేశ్వర్ గౌడ్ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అవకాశం కల్పిస్తే భారీ మెజార్టీతో కార్పొరేటర్ గా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పుష్పగుచ్చం అందజేస్తున్న రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here