నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ కు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకుల సమక్షంలో బర్త్ డే కేకు కట్ చేశారు అనిల్ కుమార్. ఈ సందర్బంగా బిఆర్ఎస్ శేరిలింగంపల్లి నాయకులు గంగారం సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, నాగరాజు, ఉమేష్ లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వర్గీయ కొండకల్ శంకర్ గౌడ్, గాలి అనిల్ కుమార్ లతో కలసి పనిచేసిన రోజులు జీవితంలో మరచిపోలేనివని అన్నారు.