నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎనక్లేవ్ కాలనీలోని రాక్ చర్చిలో క్రిస్టమస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్ సోదరి సోదరమణులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి క్రిస్టమస్ కేక్ కట్ చేసి, క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బట్టలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ అర్హులైన పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశామని, క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద క్రిస్టియన్లకు నూతన బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ స్వామి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి, అశోక్, అమరెందర్ రెడ్డి, జాంగీర్, మహ్మద్ కాజా, రోజా, సుప్రజ క్రిస్టియన్ సోదరి సోదరమణులు పాల్గొన్నారు.