శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో శ్రీ ధర్మపురి క్షేత్రం అమ్మ‌వారు

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌లో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అలంకరించారు. ఉదయం 5 గంటలకు మూలవిరాట్టు విజయదుర్గాదేవికి అభిషేకం, 9 గంటలకు శ్రీ చక్రార్చన, రుద్రాభిషేకం, కుంకుమ పూజ, నిత్య హోమం, లలితా సహస్రనామ పారాయణం, పల్లకీ సేవ, రాజోపచారములు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

శ్రీ ధర్మపురి క్షేత్రంలో రెండవ‌ రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మ‌వారు
శ్రీ ధర్మపురి క్షేత్రంలో రెండవ‌ రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మ‌వారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here