SIR పత్రాల సవరణపై కొండాపూర్ ప్రజల ఆసక్తి అభినందనీయం: అలావుద్దీన్ పటేల్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ ప్రజలు తమ SIR పత్రాల్లోని చిన్నపాటి లోపాలను సరిదిద్దుకునేందుకు చూపిస్తున్న ఆసక్తి అభినందనీయమని బీఆర్ఎస్ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావాహుడు మహ్మద్ అలావుద్దీన్ పటేల్ అన్నారు. SIR ప్రక్రియలో భాగంగా పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రజలకు నిరంతరం సహకరిస్తున్న BLOలకు కృతజ్ఞతలు తెలిపారు. SIR పత్రాల విషయంలో ఎదురయ్యే సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని, అవసరంలో ఉన్న ఇతరులకు కూడా సహాయం చేయాలని అలావుద్దీన్ పటేల్ ప్రజలను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here