- స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
- కబడ్డీ , కో కో, చెస్, క్యారమ్స్ ఆటల పోటీలను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసిన రవి కుమార్ యాదవ్
- విద్యతో పాటు విద్యార్థులకు ఆటలు కూడా అవసరమే: రవీందర్ రావు
- పోటీలో పాల్గొన్న విద్యార్థులు గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి: రాజేశ్వర్ రావు
నమస్తే శేరిలింగంపల్లి: అటల్ బీహార్ వాజ్ పాయ్ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఆట పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, ఆల్విన్ కాలనీ కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆట పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ వారం రోజుల పాటు జరిగే ఈ ఆట పోటీల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను అందరికీ తెలిసే విధంగా కృషి చేస్తూ ఓడిన ,గెలిసిన సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు శారీరక ఉల్లాసం కోసం క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ శ్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్ సాయి కుమార్, జనరల్ సెక్రెటరీ కుమార్ యాదవ్ , కన్వీనర్ రమేష్, నాయకులు నర్సింగ్ యాదవ్, కమలాకర్, ఎల్లేష్, రాజు, సందీప్ గౌడ్, ఆంజనేయులు యాదవ్, విష్ణు, సాయి పాల్గొన్నారు.