వేడుకగా క్రిస్మస్ కానుకల పంపిణీ

  • క్రైస్తవ సోదర, సోదరీమణులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గాంధీ
క్రైస్తవ సోదర, సోదరీమణులకు బట్టలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో మాదాపూర్ డివిజన్ పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావుతో కలిసి క్రిస్టియన్ సోదరి సోదరమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దుస్తులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని ఆదరిస్తున్నదని, అందరి అభిమానాలను చూరగొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతస్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని అన్నారు. క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తు క్రిస్మస్ శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అయ్యప్ప సొసైటీ అధ్యక్షుడు పెద్ద మధుసూదన్ రెడ్డి పాస్టర్లు శ్యామ్ సన్, సిల్వరాజు, విల్సన్, ప్రసాద్ , క్రిస్టియన్ సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.

వేడుకల్లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here