నమస్తే శేరిలింగంపల్లి: నేడు తారానగర్, రాంరెడ్డి గార్డెన్స్ లోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో శేరిలింగంపల్లి డివిజన్ , పాపిరెడ్డి కాలనీ నుంచి యువకులు, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జెల యోగానంద్ సమక్షంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ యువకులకు పార్టీ కండువా కప్పి బీజేపీ లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపి ఉపాధ్యక్షుడు బాలరాజు, బీజేవైఎం నాయకుడు వినోద్ చౌదరి, కళ్యాణ్, జగపతి, మల్లేష్, మురళి, కిషోర్, రఘు, ఈశ్వర్, మధు, వికాస్, రమేష్ పాల్గొన్నారు.