
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని తారా నగర్ లో స్థానిక కార్పొరేటర్ నవత రెడ్డి శనివారం పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుసుమ అపార్ట్మెంట్ వాసులను ఆమె పరామర్శించారు. తారానగర్ మార్కెట్ లో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా బాధితులైన వారందరికీ అండగా ఉంటానని, ఎటువంటి సమస్యలు ఎదురైనా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లో పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





