
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సందయ్య నగర్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. భూగర్భ సమస్య ను పరిష్కరించాలని, నల్ల పోచమ్మ ఆలయం నిర్మాణానికి సహకరించాలని స్థానికులు కార్పొరేటర్ ని కోరారు సమస్యలపై స్పందించిన రాగం మాట్లాడుతూ ప్రధాన రహదారి గుండా ప్రధాన పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని త్వరలోనే కాలనీలోని ప్రతీ గల్లీలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అదేవిధంగా నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణం చేపట్టి అన్ని విధాల అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఈ పర్యటనలో సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, వార్డుసభ్యురాలు శ్రీకళ, నాయకులు రాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.





