
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండగా ఉంటామని హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని జనప్రియనగర్, అపార్ట్మెంట్ లకు చెందిన వాచ్ మెన్, టైలర్లు, నిరుపేద కుటుంబాలకు ఆమె నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూజిత జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి అండగా నిలిచేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. డివిజన్లో ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. డివిజన్ ప్రజలకు ఇలాంటి అసౌకర్యాలు కలిగిన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ తో పాటు స్థానిక నాయకులు శాంతయ్య, రవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.





