నెహ్రూ నగర్ లో కార్పొరేటర్ రాగం పర్యటన

పేద ప్రజలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ లో‌ శనివారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడిన వారిని పరామర్శించి వారికి భోజన సౌకర్యంతో పాటు ఇంటింటికి కిలో చొప్పున కందిపప్పును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం కాలనీలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో యూజీడీ పైపులైన్ పనులు, సీసీ రోడ్డు నిర్మాణం పనులు జరిగేలా చూడాలని కార్పొరేటర్ ను స్థానికులు కోరారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని మిగిలిపోయిన యూజీడీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నెహ్రూ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ సింగ్ తో పాటు ఆంజనేయులు, మల్కయ్య, నర్సింహా, మల్లేశం, రాజు, సురేష్ గుప్తా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here