నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ నమోదు కార్యక్రమం హాఫిజ్ పెట్ 109 డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హాఫిజ్ పెట్ లో వేగంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకున్నారు. సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలని, అది మనందరి హక్కు అని బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కంది జ్ఞానేశ్వర్, సంజయ్ గౌడ్, బాబు గౌడ్ పాల్గొన్నారు.