బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శాంతిభూషణ్ రెడ్డి

నమస్తే శేరీలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా (అర్బన్) అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిలు చింతకింది గోవర్ధన్ గౌడ్, వై శ్రీధర్ లు నియామక పత్రాన్ని అందజేశారు.

బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి శాంతి భూషణ్ రెడ్డి

ఈ సందర్భంగా శాంతి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి అర్బన్ జిల్లా పరిధిలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జిల్లా మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, ఉపాధ్యక్షులు తోపుగొండ మహిపాల్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

శాంతిభూషణ్ రెడ్డికి నియామక పత్రం అందజేస్తున్న జిల్లా ఇన్చార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింత కింది గోవర్ధన్ గౌడ్, శ్రీధర్, ఉపాధ్యక్షులు తోపుగొండ మహిపాల్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here