- సాయి వైభవ్ కాలనీలో పర్యటన
- సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో పలు సమస్యలు.. చేపట్టవల్సిన అభివృద్ధి పనుల పై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గతంలో వర్షాలకు నాలా పొంగి కాలనీ అంతా ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి విదితమేనని , ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాలా విస్తరణను పొడిగించాలని అధికారులను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఇందులో భాగంగానే సాయి వైభవ్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీల మధ్య రూ. 30 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న లింక్ (సీసీ) రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్, DE విశాలాక్షి, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ TPS రమేష్ , తెరాస నాయకులు రమేష్, జగదీష్, సాయి వైభవ్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రాజు, పద్మావతి జనరల్ సెక్రటరీ, కాలనీ వాసులు అప్పారావు, దిలీప్, సుధాకర్, బాబు, కృష్ణ పాల్గొన్నారు.