నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాకులో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాదయాత్ర చేశారు. ప్రజల వద్దకు వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పన దిశగా, యాభై లక్షలు రూపాయల వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులను స్థానిక నాయకులతో కలసి పర్యవేక్షించారు. సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చెయ్యాలని కాంట్రాక్టర్ కు కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. హమీద్ పటేల్ తో పాటుగా తెరాస నాయకులు రూప రెడ్డి, డా. రమేష్, గిరిగౌడ్, యాదగిరి, ప్రభాకర్, బలరాం, మంగలి కృష్ణ, రాములు, ఖుర్షిద్ బేగం, స్థానిక ప్రజలు ఉన్నారు.