సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓసి అందజేత 

నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్ మెంట్ కి చెందిన లీలా కృష్ణ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) నుంచి మంజూరైన రూ. 2 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF – LOC మంజూరి పత్రంను బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్ పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓసి అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here