- రూ. 20వేలు అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ కి చెందిన భుజంగరావు- విజయ కుమారిల కుమార్తె బానాల శివాణికి బి. ఫార్మసి కాలేజీ పీజు రూ . 20,000లను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ పేద విద్యార్థి బానాల శివాణి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఆరిక సహాయం అందజేసినట్లు తెలిపారు. నర్సాపూర్ లోని BVRIT ఫార్మసి కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నదని, విద్యార్థి భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని కాలేజ్ ఫీజు రూ. 20,000లను చెక్కు రూపేణా చెల్లించామని తెలిపారు. చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ గాంధీకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.