యాదవ జవాన్ల కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: నవంబర్ 18న దేశం కోసం ప్రాణాలర్పించిన యాదవ్ జవాన్లను స్మరించుకుంటూ రేజంగ్లా డే ను “యాదవ్ శౌర్య దివాస్”, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళి అర్పించారు. దేశ యుద్ధ ఇతిహాసాల్లో ప్రముఖంగా ఉండదగ్గ రేజింగ్లా యుద్ధం గురించి చరిత్రలో ఒక్క పూట కూడా లేకపోవడం బాధాకర మని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాగం సుజాత నాగేందర్ యాదవ్ అన్నారు. సుమారు 16 వేల అడుగుల ఎత్తులో -25 డిగ్రీల శీతల ఉష్ణోగ్రత లో చాశుల్ అనే ప్రాంతంలో సుమారు 5 వేల మంది చైనా సైనికులు దేశంలోకి చొరబడడానికి ప్రయత్నించగా.. వారిని నిలువరించేందుకు మనదేశంలో సరైన ఆయుధ సంపత్తి లేకున్నా ప్రతి సైనికుడు 100 మంది చైనీయుల సైన్యాన్ని మట్టుబెట్టాలన్న దృఢసంకల్పంతో “లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్” అనే నినాదంతో పోరాడారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాగం అభిషేక్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, పెరుగు కుమార్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్, కవిత యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, మహేష్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ యువ నాయకులు గడ్డం రవి యాదవ్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సాయి యాదవ్, పెరుగు వివేక్ యాదవ్, సతీష్, పాషం రఘు యాదవ్ పాల్గొన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన యాదవ్ జవాన్లను స్మరించుకుంటూ నివాళి అర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాగం సుజాత నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here