నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాకి చెందిన ప్రియాంకకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఆర్థిక స్తోమత లేని అభాగ్యులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.