ఈ నెల 19, 20 న చార్మినార్ కప్ స్విమ్మింగ్ పోటీలు

  • 6 నుంచి 16 ఏండ్ల వారికి అవకాశం – ఇప్పటికే 300 లకు పైగా రిజిస్ట్రేషన్లు
  • పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 19, 20 తేదిల్లో ఈత పోటీలను నిర్వహిస్చున్నట్లు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పోటీలకు సంబంధించిన పోస్టర్ ను గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పోటీల్లో 6 నుండి 16 సంవత్సారాల స్విమ్మర్లు పాల్గొనవచ్చునని తెలిపారు. ఇప్పటి వరకు 300 పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు గచ్చిబౌలి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ కొండ విజయ్ కుమార్ తెలిపారు. వివరాలకు 9441229192 సంప్రదించగలరని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు ఉమేశ్, జగదీశ్ , సమంత రెడ్డి పాల్గొన్నారు.

గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులతో పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here