- ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో చిల్డ్రన్స్ డే సందర్బంగా సాత్విక శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఆనంద నర్తన గణపతిమ్, మూషిక వాహన, గజవదాన బెదువే, బ్రహ్మాంజలి, శివ కైవారం, శ్రీహరి స్తోత్రం, దుర్గ చాలీసా, అదిగో అల్లదిగో, శివ పంచాక్షరీ, దసవాత్ర రూపకం, బ్రహ్మమురారి, శివ తాండవ స్తోత్రం, చిలుకమా సందేశం, వందేమాతరం మొదలైన అంశాలను హర్షిత, మేఘన, రన్విత, నీలిమ, నియతి, శ్రీ స్వీత పూజ, జాహ్నవి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
