ఎంపిపిఎస్ పాఠశాలలో వేడుకగా బాలల దినోత్సవం

  • వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీ ఎంపిపిఎస్ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ఆటపాటలు, అల్లరితో ఎంతో సందడి నెలకొన్నది. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్ లాల్ నెహ్రూ సొంతమన్నారు. అనంతరం పోటీల్లో గెలిచినా బాలలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు దేవదాసు, అధ్యాపకులు అశ్రఫ్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బసవరాజ్ లింగయత్, చైల్డ్ ఫండ్ ఇంచార్జ్ గ్రేసీ, మల్లికాంబ, మహేశ్వరి, లింగంపల్లి విలేజ్ డెవెలప్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మహేష్ రాపన్, వార్డ్ మెంబెర్ శ్రీకళ, రోజా, జయ, భాగ్యలక్ష్మి, కళ్యాణి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

సురభి కాలనీ ఎంపిపిఎస్ పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కార్పొరేటర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here