- ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూకట్పల్లి జోన్ ఏజీఎం వి వేణుగోపాల్
నమస్తే శేరిలింగంపల్లి : నిజాంపేట్ నారాయణ ఇ – టెక్నో పాఠశాలలో జరిగిన మోడల్ యునైటెడ్ నేషన్స్ ఎంయూఎన్ కాన్ఫరెన్స్ కూకట్ పల్లి జోన్ లెవల్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి పోటీలలో పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరించి రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల గురించి, ప్రపంచంలో శాంతి స్థాపన , ఉన్నత విద్య, మెరుగైన ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు తదితర అంశాలపై విద్యార్థులు సుదీర్ఘంగా చర్చించారు. వాటికి కావలసిన సమాధా నాలను, సలహాలను తెలిపారు. విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని, ప్రపంచ దేశాల పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని కూకట్ పల్లి జోన్ ఏజీఎం వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి జోన్ ఏజీఎం వేణుగోపాల్, కోఆర్డినేటర్ లక్ష్మి, పాఠశాల ప్రిన్సిపల్ టి. సుహాసిని, స్టాప్ స్కిల్స్ ట్రైనర్స్ యోగేంద్ర, షఫీ, ప్రమోద్, బాలు, రుచిత, సురేష్, ఈశ్వర్, కృష్ణవేణి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.







